VZM: భీమసింగి రైల్వే వంతెన వద్ద రోడ్డు గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారింది. జామి కొత్తవలస నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లడానికి ప్రధాన రహదారి కావడంతో రోజు కొన్ని వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతూ ఉంటాయి. రోడ్డుపై గుంతలు ఏర్పడడంతో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.