GNTR: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతి డివిజన్ అభివృద్ధిపై దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే గళ్ళా మాధవి తెలిపారు. బుధవారం గుంటూరు 43, 44వ డివిజన్లలో రూ. 2.65 కోట్ల అభివృద్ధి పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ పనులు ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.