ATP: గుత్తి పోలీస్ స్టేషన్లో జిల్లా ఎస్పీ జగదీష్ బుధవారం సాయంకాలం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా సీఐ రామారావు, ఎస్సై సురేష్ గౌరవ వందనంతో జిల్లా ఎస్పీని స్వాగతం పలికారు. అనంతరం పోలీసు స్టేషన్ నిర్వహణ, పరిసర ప్రాంతాలు, సిబ్బంది పనితీరు, విధులు, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, స్టేషన్లో నిర్వహిస్తున్న కేసు డైరీ, విలేజ్ రోస్టర్లను పరిశీలించారు.