HYD: పెద్ద శ్రీశైలం యాదవ్ కుమారుడు గౌతం యాదవ్ గులాబీ కండువా కప్పుకున్నారు. బుధవారం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది. గౌతం యాదవ్ వరుసకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు సోదరుడు. ఉప ఎన్నిక ముంగిట ఇది కీలక పరిణామం అని రాజకీయ నాయకులు అంటున్నారు. చేరికల కార్యక్రమంలో MLA తలసాని సాయి యాదవ్, సాయి కిరణ్, నగేశ్ ముదిరాజ్ ఉన్నారు.