BPT: చందోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై మర్రి వెంకట శివకుమార్ బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలు సరిగా లేని వారికి అపరాధ రుసుము విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్సై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన కోరారు. చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.