JGL: రైతులు కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలంలోని చల్గల్ గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. రైతులు దళారులను నమ్మి మోసపోకుండా కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం విక్రయించాలని సూచించారు.