ADB: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గత నెల 19న జరిగిన వ్యాసరచన, డ్రాయింగ్, ఉపోద్ఘాతం పోటీల విజేతలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం బహుమతులు అందజేశారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధికి విద్యార్థుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. పర్యాటక ప్రదేశాలను సందర్శించి, వాటి చరిత్రను తెలుసుకోవాలని సూచించారు.