కోనసీమ: కాట్రేనికోన మండల కేంద్రమైన కాట్రేనికోనలో నిర్మాణంలో ఉన్న అన్నా క్యాంటీన్‌ను ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు , అమలాపురం ఎంపీ గంటి హరీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్ వేగంగా సిద్ధం కావాలని సూచించారు