PDPL: గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వైద్యం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్న బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాజారెడ్డి డిమాండ్ చేశారు. కార్మికుడి కుమార్తె పురిటి నొప్పులతో వస్తే కడుపులోనే శిశువు మృతి చెందాడన్నారు. అయితే ఇదంతా వైద్యుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆయన ఆరోపించారు. సకాలంలో వైద్యం అందించలేదని పేర్కొన్నారు.