ASF: జిల్లాలో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ఈనెల 23తో ముగియనుంది. ఈసారి వెయ్యికి పైగా దరఖాస్తులు వస్తాయని ASF ఎక్సైజ్ అధికారులు అంచనా వేయగా, గడువు పొడిగించినా ఇప్పటివరకు కేవలం 622 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. మరో రెండు రోజులు గడువు ఉండటంతో దరఖాస్తుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.