NLG: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి, నాగార్జున సాగర్ బోర్డర్ వద్ద ఉన్న ఆర్టీఏ చెక్‌పోస్ట్‌లను మూసివేయాలని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు అక్కడి బోర్డులు, బ్యారికేడ్లు తొలగించగా, చెక్‌పోస్ట్‌కు సంబంధించిన రికార్డులు, పరికరాలను జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయానికి తరలించారు.