PDPL: స్థానిక ఎన్నికల్లో యాదవులు ముందుండాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేష్ యాదవ్ అన్నారు. ధర్మారం మండల కేంద్రంలో యాదవ మహాసభ సమావేశం జరిగింది. అక్టోబర్ 24న మానకొండూర్ మండలం ఖాదర్గూడెంలో అరబిందా ఫాంహౌస్లో రాజకీయ శిక్షణ శిబిరం జరుగనుందని, స్థానిక సంస్థల ఎన్నికలలో యాదవులలో శక్తివంతమైన నాయకత్వాన్ని తయారు చేయడం లక్ష్యంగా శిక్షణ ఇస్తారన్నారు.