MBNR: కురుమూర్తి స్వామి వారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28న ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవానికి దాదాపు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామని తెలిపారు. అందుకు తగ్గట్లు పూర్తి ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.