NLR: మనుబోలు మండలంలోని కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బొలెరో, బైక్ ను ఢీకొనడంతో ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో వాహనం ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ తీవ్ర గాయాలతో చనిపోయిందని వారు పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.