ATP: శెట్టూరు మండలం అనుంపల్లిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ఉచిత విద్య, వైద్యం ప్రజల హక్కు అని పేర్కొన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 60 వేల సంతకాల సేకరణ లక్ష్యంగా ఉందన్నారు.