JGL: పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్సై అనిల్ బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో రోజువారీగా నిర్వహించే విధుల గురించి, పోలీస్ స్టేషన్ రికార్డ్స్ గురించి తదితర వాటిపై అవగాహన కల్పించారు.