ATP: రాయదుర్గం బస్టాండ్ పరిసర ప్రాంతంలో హమాలీలు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భోజన ఏర్పాట్లు చేసిన వారిని అభినందించారు. శ్రమజీవుల సేవకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రజలతో కలిసి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు.