BHNG: రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. ఇవ్వాళ అడ్డగూడూరు మండల పరిధిలోని ధర్మారం, చౌల్లరామారం, కోటమర్తి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు.