శ్రీలంక క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది జరగాల్సిన లంక ప్రీమియర్ లీగ్(LPL)ను వాయిదా వేసింది. వచ్చే ఏడాది స్వదేశంలో జరుగనున్న పురుషుల T20 వరల్డ్ కప్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. లీగ్ తదుపరి నిర్వహించబోయే తేదీలను త్వరలో ప్రకటిస్తామని తెలిపింది. ప్రస్తుతం శ్రీలంకలో మహిళల వన్డే ప్రపంచకప్ జరుగుతున్న విషయం తెలిసిందే.