TG: మేడ్చల్లోని పోచారంలో కొందరు దుండగులు కాల్పుల కలకలం సృష్టించారు. ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.