E.G: తూ.గో జిల్లా వసతి గృహాలలో ఉండే పిల్లల విషయంలో అన్ని వసతి గృహాల వార్డెన్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం తెలిపారు. వసతి గృహాల నుండి పిల్లలను పంపేముందు, పిల్లల సంరక్షణలో భద్రతను గరిష్టంగా నిబంధిస్తూ, బంధువుల వివరాలు, తగిన ఆధారాలు ముందుగా నమోదు చేసుకోవాలన్నారు.