కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. AIతో రూపొందించే ఫొటోలు, వీడియోలు, ఆడియోలు, కంటెంట్‌కు తప్పనిసరిగా లేబుల్ చేయాలని సూచించింది. దీంతో డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు అవకాశం ఉంది. కాగా కొందరు AIని ఉపయోగించి ప్రముఖుల డీప్ ఫేక్ వీడియోలను సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సమాచారం పక్కదారి పట్టే అవకాశం కూడా ఉంటుంది.