BDK: తెలంగాణ సెక్రటేరియట్లో గిరిజన ముస్లిం మైనార్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ను ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఇటీవల అశ్వరావుపేట నియోజకవర్గానికి రూ. 13 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతర్గత రహదారులు, బ్రిడ్జిల నిర్మాణంకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.