KDP: కడప జిల్లాలో అన్ని పాఠశాలలకు గురువారం సెలవులు ప్రకటిస్తూ డీఈవో శంషుద్దీన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా సెలవు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాగా, 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.