NRPT: ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా అందించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం నారాయణపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఎస్పీ డాక్టర్ వినిత్తో కలిసి పాల్గొన్నారు.