PLD: రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి పల్నాడు ఎస్పీ కృష్ణారావు ఆదేశాల మేరకు “ఫేస్ వాష్ అండ్ గో” కార్యక్రమం బుధవారం మొదలైంది. జిల్లాలోని జాతీయ రహదారులపై, ముఖ్యంగా “బ్లాక్ స్పాట్స్” వద్ద దీనిని నిర్వహిస్తున్నారు. పోలీసులు లారీ, బస్సు, కార్ల డ్రైవర్ల ముఖాలను నీళ్లతో కడిగి, అప్రమత్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.