ELR: జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం కాలువ కల్వర్టు పూర్తిగా దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగింది. అయితే ఇవాళ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేరుగా అక్కడికి చేరుకొని కల్వర్టు తాత్కాలిక పనులు చేపించి రాకపోకలు సాగేలా చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తీవ్ర వర్షాల కారణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాశ్వత పరిష్కారం చూడటం మన బాధ్యతన్నారు.