SDPT: బెజ్జంకి పోలీస్ స్టేషన్లో బుధవారం ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోలీసు విధులు, బాధ్యతలు, నేర నిరోధక చర్యలు, కేసుల చేదన, ఆయుధాల వినియోగం, సైబర్ నేరాలపై జాగ్రత్తలు తదితర అంశాలపై సిద్దిపేట రూరల్ సీఐ ఎం శ్రీను, ఎస్సై సౌజన్య అవగాహన కల్పించారు.