MLG: జిల్లా కేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్, వివేకవర్ధిని హై స్కూల్లో ఇవాళ SI చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల ప్రమాదం, నివారణలో పోలీసుల పాత్రపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడవద్దని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.