MNCL: నెన్నెల మండలం కేంద్రంలో షేక్ యాకుబ్(25) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాలు యాకుబ్ గత కొంతకాలంగా మద్యానికి బానిసై, నిత్యం భార్యతో గొడవలు పడేవాడన్నారు.ఈ క్రమంలో బుధవారం ఉదయం అతిగా మద్యం సేవించి ఇంటి నుంచి వెళ్లి గ్రామ శివారులో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు