NLG: దేవరకొండ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల NSS యూనిట్-1&3 విద్యార్థులు ప్రత్యేక శిబిరం కార్యక్రమంలో తాటికోల్, నందనమిట్టలో బుధవారం డ్రగ్స్‌పై అవగాహనా ర్యాలీ నిర్వహించారు. యువత, విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్స్ నర్సింహ, జయప్రకాశ్ నారాయణ, హై స్కూల్ పీడీ సైదులు,తదితరులు పాల్గొన్నారు.