ATP: గుత్తి పెన్షనర్స్ భవనంలో బుధవారం విప్లవ గిరిజన నాయకుడు కొమరం భీమ్ 124వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కొమురం భీం చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.పెన్షనర్స్ కోశాధికారి జన్నే కుల్లయ్య బాబు మాట్లాడుతూ.. జల్, జంగిల్, జమీన్ నినాదంతో గిరిపుత్రుల హక్కుల కోసం సాయుధ పోరాటం చేసిన యోధుడు కొమరం భీమ్ అన్నారు.