KKD: శంఖవరం మండలం అన్నవరంలోని హరిహర రిసార్ట్స్‌లో జరిగిన తుని జోన్ ఆత్మ కమిటీ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ పాల్గొని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పాలక మండలి సభ్యులకు అభినందనలు తెలిపారు. వ్యవసాయం దాని అనుబంధ రంగాల అభివృద్ధికి ఈ నూతన పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని అన్నారు.