RR: హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి డివిజన్ పరిధిలోని వసంత నగర్ కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లెవెల్స్ సరి చూసుకుంటూ సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని, వీలైనంత త్వరగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.