SRPT: హుజూర్నగర్లో జరిగిన బీజేపీ పట్టణ కార్యవర్గ సమావేశంలో అధ్యక్షుడు కొండ హరీష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాల్లో స్థానిక నిరుద్యోగ యువతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఉన్నప్పటికీ స్థానిక యువతకు ఉద్యోగాలు లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ప్రైవేట్ జాబ్ మేళాల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని తెలిపారు.