E.G: కేంద్రంలో, రాష్ట్రంలో NDA డబల్ ఇంజిన్ సర్కార్ సమగ్ర,సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసే విధంగా పనిచేస్తోందని ఎంపీ పురందేశ్వరి బుధవారం అన్నారు. విజయవాడలో జరిగిన రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆమె హాజరయ్యారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అభివృద్ధి ఫలాలు సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు అందాలని మోదీ ఆలోచన అన్నారు.