KKD: గండేపల్లిలో మండల వ్యవసాయ అధికారి కార్యాలయ ఆవరణలో మొదటి ధాన్యం కొనుగోలు కేంద్రం బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఛైర్మన్ తోట సుధీర్, జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా తమ ధాన్యం అమ్ముకుని అధిక ధరలు పొందాలన్నారు.