కోనసీమ: కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు బుధవారం విజయవాడలో ఏపీటీడీసీ ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ యం. శేషగిరిని కలిశారు. రానున్న సంక్రాంతికి ఆత్రేయపురం వద్ద నిర్వహించనున్న జాతీయస్థాయి బోట్ ఫెస్టివల్‌కు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. ఈసారి జాతీయస్థాయిలో పడవల పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా ఏర్పాట్లకు నిధులు మంజూరు చేయాలని కోరారు.