ASR: కొమరం భీమ్ 124వ జయంతి వేడుకలను అరకు కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గిరిజనుల హక్కులు, చట్టాలను కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్టంగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.