గుంటూరు: జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వకుల్ జిందాల్ని సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన ఎస్పీని కలిసి, పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన ఎస్పీకి జిల్లాలో శాంతిభద్రతల నిర్వహణకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.