E.G: గోదావరి నది తీర మండలాలు, లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం సూచించారు. వచ్చే 24 గంటల్లో వర్షాల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విభాగాలు అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని సూచనలు చేశారు. తీర ప్రాంతాలు, నదీ పరివాహక మండలాలు, తక్కువ ఎత్తులో ఉన్న గ్రామాలలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.