ప్రకాశం: జిల్లాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని ఎస్ ఈ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ఇంట్లో విద్యుత్ ఉపకరణాలు వాడే క్రమంలో తడి చేతులతో తాకకూడదని తెలిపారు. గాలులు వీచే సమయంలో కరెంట్ తీగలకింద ఉండకూడని, తీగలు తెగిపడినా విద్యుత్ సిబ్బందికి తెలియజేయాలని ఆయన సూచించారు.