TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా.. షేక్ పేట ఆర్వో కార్యాలయానికి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత వెళ్లారు. తాను నామినేషన్లో సమర్పించిన వివరాలు సరైనవేనని మరో అఫిడవిట్ దాఖలు చేశారు. నామినేషన్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు 40 నామినేషన్లను స్క్రూటీని చేశారు. రేపు కూడా నామినేషన్ల పరిశీలన జరగనుంది. కాగా, సునీత.. గోపినాథ్ భార్య కాదంటూ ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.