WNP: తెలంగాణ రాష్ట్ర సాధనకు కొమరం భీమ్ పోరాటం స్ఫూర్తినిచ్చిందని కవి పండితుడు గిర్రాజు ఆచారి అన్నారు. వనపర్తి మండలం చిట్యాల జడ్పీహెచ్ఎస్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజన హక్కుల కోసం నిజాం రజాకార్లతో భీమ్ గెరిల్లా యుద్ధం చేశారన్నారు. విద్యార్థులు ఆయన త్యాగాన్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. డీఈవో కార్యాలయం అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.