SDPT: తోగుట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ కె.హైమావతి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లు, ల్యాబ్, ఫార్మసీలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, రోజువారీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. అన్ని రకాల మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని, ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని వైద్య సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు.