AP: కూటమి ప్రభుత్వంలో ప్రజాభిప్రాయానికి విలువ లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్ని రాజయ్యపేటకు తీసుకురావాలని బాధితులు కోరినట్లు తెలిపారు. బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఈ పార్క్ రద్దు చేస్తామని చెప్పారు. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారని వెల్లడించారు.