TG: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని మంత్రి దామోదర రాజనరసింహా అన్నారు. సంగారెడ్డి జిల్లాలో పోలీసు కుటుంబాల కోసం వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి.. పోలీసులను, వారి కుటుంబాలను కాపాడుకోవడం తమ బాధ్యత అన్నారు. సామాన్యుడికి ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు.