VSP: శాసనసభాపక్ష ఫిర్యాదుల (పిటిషన్ల) కమిటీ ఛైర్మన్, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణం రాజు అధ్యక్షతన కలెక్టరేట్లో ఫుడ్ అండ్ సేఫ్టీ అంశంపై ఉన్నత స్థాయి సమీక్ష జరిగింది. ఫుడ్ సేఫ్టీ శాఖలో 500 మంది ఉద్యోగుల కొరత ఉందని, ప్రస్తుతం కేవలం 251 మంది సిబ్బంది పనిచేస్తున్నారని గుర్తించారు. రాష్ట్రంలో కేవలం 45 ల్యాబ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు.