ATP: విడపనకల్ మండల హవళిగి గ్రామంలో మంత్రి పయ్యావుల కేశవ్ రూ.7.40 కోట్ల వ్యయంతో ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం కల్పించే నూతన పైప్ లైన్లను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు తాగునీటి సమస్యను పట్టించుకోలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత సమస్యల పరిష్కారానికి శ్రద్ధ చూపుతున్నట్లు మంత్రి వ్యాఖ్యానించారు.