ప్రకాశం: భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజా బాబు బుధవారం ఆదేశించారు. అత్యవసర సహాయం కోసం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ నంబర్ 1077కు ప్రజలు ఫోన్ చేయాలని కోరారు. భారీ వర్షాలు కురుస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని ఆయన హెచ్చరించారు.